ఘనంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

★ నందిగామ 9 వ వార్డు మెంబర్ పాలకొండ ఎల్లయ్య  సమక్షంలో అనిరుద్ రెడ్డి మాతృమూర్తి జనంపల్లి శశికళ రెడ్డి ఆధ్వర్యం లో కేక్ కటింగ్ ★ రాజాపూర్ మండల కేంద్రం లో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యం లో సంబరాలు

పయనించే సూర్యుడు 01-01-2026, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండల కేంద్రం లో జడ్చర్ల నియోజకవర్గ శాసన సభ సభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ,స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, వార్డు మెంబెర్స్ అందరి ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ నందిగామ గ్రామం 9 వ వార్డు మెంబర్ పాలకొండ ఎల్లయ్య ఆధ్వర్యం లో నందిగామ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి జనంపల్లి శశికళ రెడ్డి సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నందిగామ గ్రామ 9 వ వార్డు మెంబర్ పాలకొండ ఎల్లయ్య,  10 వ వార్డు మెంబర్ ధోనూరు శంకరమ్మ నరసింహ, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాపల్లి రాఘవేందర్,గగలపల్లి శ్రీను, నందారం చంద్రయ్య, దోనూర్ శ్రీను, గగలపల్లి అంజి, బోలా హరి తదితరులు పాల్గొన్నారు.