
పయనించే సూర్యుడు, జనవరి 1, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండల కేంద్రంలోని వాణి హై స్కూల్ బచ్చన్నపేటలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. బుధవారం వాణి హై స్కూల్ బచ్చన్నపేట విద్యార్థులు, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి భారీ కేకు కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత మాట్లాడుతూ గత సంవత్సరంలో ఏర్పడిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏవైనా పొరపాట్లు ఉన్నచో సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చదువులో ఇంకా ముందుకు వెళ్ళేలా కృషి చేయాలని, విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉన్నత స్థితికి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎం శ్వేత, స్వాతి, హైమావతి, మౌనిక, శ్రీనివాస్, షారూక్, బాబు, వాణి, శశికళ, స్వప్న, పద్మ, రజిత, అనూష, రోజా, తదితరులు పాల్గొన్నారు.