పయనించే సూర్యుడు 01-01-2026 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని మాంటిస్సోరి ప్రిన్సిపాల్ గీతాషాజు అన్నారు. బుధవారం పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన మహమ్మద్ నూరిన్ జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ . గతనెల డిసెంబర్ 25న వనపర్తిలో జరిగిన అండర్ 14 హాకీ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభను కనపరిచినందుకు జనవరి 2 వతేదీన మధ్యప్రదేశ్ లో ని గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి అండర్ 14 బాలికల హాకీ పోటీల్లో ఆమె ఎంపిక కావడం ప్రశంసనీయమన్నారు. ఈ విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకొని మరెందరో క్రీడాకారులు తయారు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ షాజూ థామస్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.