పయనించే సూర్యుడు, జనవరి 1, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలంలోని చిన్న రామచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది.అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బచ్చన్నపేట మండలం చిన్న రాంచెర్ల గ్రామానికి చెందిన రాంరెడ్డి,(80) లక్ష్మి (70)గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ పలు మార్లు చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఈ తరుణంలో వారికి ఏమి చేయాలో తోచక అర్థరాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని, సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్సై హమీద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.