
పయనించే సూర్యుడు 01-01-2026 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు సూచనల మేరకు చేజర్ల మండల కేంద్రంలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జిల్లా టీడీపీ నాయకులు రావి పెంచలరెడ్డి , మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ మరియు బీసీ సెల్ నాయకులు ఉడతా పెంచలయ్య, రంపాటి ప్రసాద్ ఐటీడీపి నాయకులు షేక్ మస్తాన్ షరీఫ్ ఆర్యవైశ్య నాయకులు పువ్వాడి శ్రీనివాసరావు, బొగ్గవరపు సుధాకర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.