
పయనించే సూర్యుడు జనవరి 1, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఎన్నారై సందీప్ ఆదేశాలతో తూరంగి గ్రామం జనావాళి వృద్ధాశ్రమంలో సుమారు 50 మందికి దుప్పట్లో, పండ్లు, కేక్ లు మరియు స్వీట్లు అందజేయడం జరిగిందని వైకాపా రూరల్ మండలం వైస్ సోషల్ మీడియా అధ్యక్షులు ధరణికోటి అభిషేక్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తూ రంగి గ్రామంలో గల వయోవృద్ధుల ఆశ్రమలో సుమారు 50 మందికి పండ్లను దుప్పట్లను స్వీట్స్ ను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ధరణికోటి అన్నపూర్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సందీప్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ముందు రోజు వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధరణికోటి అభిషేక్, ధరణికోటి విశ్వనాథం, శ్యామ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.