పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 1 బోధన్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సాధారంగా స్వాగతం పలికారు.జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన వినయ్ కృష్ణారెడ్డి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో కలెక్టర్ గా త్రిపాఠి బాధ్యతలను చేపట్టిన సందర్భంగా కలెక్టర్ కు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో శుభాకాంక్షలు తెలిపారు.ముందస్తుగా జిల్లా కలెక్టర్ త్రిపాఠికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.మీ సహకారంతో బోధన్ డివిజన్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తామన్నారు.