
పయనించే సూర్యుడు జనవరి 01 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని టీడీపీ కార్యాలయంలో టిడిపి పార్టీకార్యకర్తలకు ఘనంగా ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఆదోని టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో విశేష సేవలు అందించిన కార్యకర్తలను గుర్తిస్తూ ఈ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,టిడిపి పార్టీ రాష్ట్ర నాయకులు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా 47 మంది కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.