పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 01: ఊటుకూరు పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం డిబిఎన్ పల్లెలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను జెసిబితో తొలగించి చెత్తను తొలగించి గ్రామం అంతా బ్లీచింగ్ చల్లారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వానలు మరియు శీతాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు రోగాలు బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్ అచ్యుత్ సాయి, సిబ్బంది వెంకటయ్య, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.