తల్లాడలో ఘనంగా జరిగిన క్రిస్టియన్ సోదరుల ప్రేమ విందు

★ సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పలు సంఘాల క్రిస్టియన్ పెద్దలు. ★ ప్రజా ప్రతినిధులకు,పాస్టర్ పెద్దలకు ఘన సన్మానాలు.

పయనించే సూర్యుడు న్యూస్ 01-01-2026, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వమతాలను సమదృష్టితో చూడాలన్న సంకల్పంతో క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరీ సోదరీమణులకు స్థానిక సంఘ పెద్దలతో ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం నూతనంగా నిర్మించబడుతున్న అంబేద్కర్ భవన్ లో మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల క్రిస్టియన్ సోదరీ, సోదరీమణులు పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఏసుక్రీస్తు చూపిన ప్రేమను అనుసరించాలని సూచించారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ( RI) క్రిస్టియన్ ప్రముఖులతో కలిసి కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి అనంతరం ప్రభుత్వం చేత అందించబడుతున్న క్రిస్టమస్ ప్రేమ విందును ప్రతి ఒక్కరు స్వీకరించారు. అనంతరం పలువురుకు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆర్గనైజేషన్ (ఎన్. సీ. సీ,టి సి, ఏఐసీసీ) క్రిస్టియన్ నాయకులు మేకల ప్రసాదరావు, సంఘసాని శ్రీనివాస్, కె. కెనడి రాజు, ఐ. శ్రీనివాసరావు, కె.వి ఇశ్రాయేలు, టి.సాల్మన్ రాజ్, జి.బాబురావు, మేడి.యాకోబు . మండల కాంగ్రెస్ నాయకులు దగ్గుల రఘుపతి రెడ్డి, తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జి.వి.ఆర్, మాజీ జెడ్పిటిసి మూకర ప్రసాద్, గొడుగునూరి లచ్చిరెడ్డి, ఆర్.ఐ, టిడిపి నాయకులు ధూపాటి భద్రరాజు, సరికొండ శ్రీనివాసరాజు, క్రిస్టియన్ సోదరీ సోదరీమణులు విశ్వాసులు తదితరులు అధికంగా పాల్గొన్నారు