తాసిల్దార్ ఎస్సై బిఖ్యా నాయక్ అధ్యర్యంలో పౌర హక్కుల దినోత్సవం అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ 01-01-2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ యందు పౌర హక్కుల దినం సందర్భంగా చేగుంట తాసిల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దిన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం ప్రతినెల 30వ తేదీన మండలంలోని ఏదో ఒక గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీలకు జరిగే అన్యాయాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. గ్రామంలో ఎక్కడైనా రెండు గ్లాసుల విధానం మరియు గుడిలోకి ఎస్సీ, ఎస్టీలను ప్రవేశం నిరాకరించినట్లు అయితే, బాణమతి పేరుతో వ్యక్తులను చంపడం లాంటివి కులం పేరుతో దూషించినట్లయితే అన్ని వార నిరోధక చట్టం 1955 ప్రకారం 6 నెలలు తగ్గకుండా గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా విధించడం జరుగుతుంది. ఇలా చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు నమోదు చేసి డిఎస్ పి అధికారితో విచారణ చేయబడుతుంది. ఎస్సీ ఎస్టీల కోసం ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు సౌకర్యం ఉంటుంది ఐదవ తరగతి నుండి 8 వ తరగతి వరకు బాలురకు వెయ్యి రూపాయలు, బాలికలకు 1500 రూపాయలు, అలాగే తొమ్మిది పది చదివే బాలురకు 3500 బాలికలకు 3500 ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాల సహకారం ప్రభుత్వపరంగా ఉంటుంది.కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, ఎస్సై బిఖ్యా నాయక్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రమేష్, ఆర్ ఐ లు జయభారత్ రెడ్డి, సుజాత, పంచాయతీ ఈవో వెంకటేష్,సర్పంచ్ స్రవంతి సతీష్, ఉపసర్పంచ్ రఫీ, వార్డ్ మెంబర్లు వంశీ, సాయిబాబా, ఎల్లేష్, లింగం లింగం మహేష్, ఎస్సీ కాలనీ ప్రజలు పలు అధికారులు పాల్గొనడం జరిగినది.