తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ జిల్లా అధ్యక్షులుగా సూర్యారావు ఎంపిక

★ సమావేశంలో పాల్గొన్న డాక్టర్లు.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 1 బోధన్ : తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ జిల్లా యూనియన్ నూతన అధ్యక్షులుగా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సూర్యారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోధన్ పట్టణంలో బుధవారం డాక్టర్స్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో చర్చల అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సెక్రటరీగా మల్లు నవీన్,ట్రెజరర్ గా డాక్టర్ వేణుగోపాల్ లను ఎంపిక చేశారు. కమిటీ ఎన్నికలలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలి రామచందర్, ఎలక్షన్ కమిషనర్ గా డాక్టర్ మన్మోహన్ కళ్యాణ్ పాండ్, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారిగా డాక్టర్ శివ ప్రసాద్ మరియు రవీందర్ రెడ్డి, డాక్టర్ సుభాష్, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ రాకేష్ లు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు డాక్టర్ సూర్యారావు మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా తానా మెంబర్షిప్ తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.