పయనించే సూర్యుడు జనవరి 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2026 సంవత్సరపు డైరీ, క్యాలెండర్ ను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రొవిబిషన్ మరియు ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ లోని తమ క్యాంప్ ఆఫీస్ దగ్గర స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ 2026 సంబంధించి డైరీ క్యాలెండర్ మరియు జీవోల ప్రతులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థను గాడిలో పెడుతుందని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే గాక విద్యార్థులకు పౌష్టిక ఆహారము వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వము చర్యలు చేపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే. శ్రీధర్ రావు ప్రధాన కార్యదర్శి ఎస్.మురళి రాష్ట్ర నాయకులు సతీష్,కే.రమేష్ ,ప్రభాకర్ జిల్లా నాయకులు ఈశ్వర్, కరుణాకర్ రెడ్డి , బి.శేఖర్,మద్దిలేటి మల్లయ్య ,జి.కురుమయ్య, జాకీర్ హుస్సేన్,హనుమంతు, బి.కురుమయ్య కొల్లాపూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వరప్రసాద్, చంద్రుడు,చెన్నయ్య నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.