పయనించే సూర్యుడు జనవరి : 1 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అలాగే జ్యోతుల నెహ్రూ అభిమానులకు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు అనగా 2026 జనవరి 1వ తేదీ (గురువారం) నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ , కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ నూతన సంవత్సర వేడుకలకు అందుబాటులో ఉండరని తెలిపింది. నూతన సంవత్సర శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు వారు హాజరు కాలేరని స్పష్టం చేశారు.అందువల్ల ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.