పాతర్లపాడు గ్రామంలో రెండు చేతి పంపుల మరమ్మత్తు

★ తాగునీటి సమస్యకు పరిష్కారం గ్రామస్తుల హర్షం

పయనించే సూర్యుడు 01-01-2026, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). పాతర్లపాడు గ్రామంలో పులగం రాములు ఇంటి వద్ద ఉన్న చేతి పంపును గ్రామంలోని ప్రతి ఒక్కరూ తాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అయితే ఆ చేతి పంపు ఇటీవల చెడిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఎస్సీ కాలనీ ప్రైమరీ స్కూలు ప్రాంగణంలో ఉన్న చేతిపంపు కూడా గత ఒక సంవత్సరమునర కాలంగా చెడిపోయి ఉపయోగానికి వీల్లేకుండా ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీమతి ఓబిన బోయిన లక్ష్మీ, ఉప సర్పంచ్ దారెల్లి సురేష్ ఆధ్వర్యంలో వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. వారి కృషితో చెడిపోయిన రెండు చేతు పంపులను మరమ్మతులు చేయించి పాతర్లపాడు గ్రామ ప్రజలకు అలాగే ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు తాగునీటి సౌకర్యాన్ని పునరుద్దించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.