పార్టీ బలోపేతానికి – అంకితభావానికి గౌరవం కార్యకర్తకు ప్రశంసా పత్రం

★ ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రం ఎమ్మెల్యే బీవీ చేతుల మీదుగా పంపిణీ ★ ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలు అందుకున్న సంజీవయ్య ఆచార్యులు స్వామి, నీలకంఠ

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 01: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ అదేశాల మేరకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా బీవీ జయనాగేశ్వర రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఘనంగా ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం తో పాటు వివిధ కార్యక్రమలలో చురుకుగా పాల్గొన్న 83 మంది టీడీపీ కార్యకర్తలను అధిష్టానం గుర్తించిన వారికీ ఎమ్మిగనూరు నియోజకవర్గం శాసనసభ్యులు డా బీవీ జయ నాగేశ్వరరెడ్డి రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా గోనెగండ్ల మండలం వీరంపల్లి గ్రామానికి చెందిన సంజీవయ్య ఆచార్యులు స్వామి, గంజిహళ్లి గ్రామానికి చెందిన జి నీలకంఠ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే పునాది. అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇవ్వడమే మా లక్ష్యం, కార్యకర్తల కష్టానికి విలువ ఇచ్చే నాయకత్వం టీడీపీదే, అని కార్యకర్తలలో మరింత ఉత్సాహం పార్టీపై నమ్మకం మరింత బలపడటం భవిష్యత్ రాజకీయ పోరాటాలకు సన్నద్ధత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ మూడు మండలాల అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య, నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.