పిఎసిఎస్ చైర్మన్ పదవిపై ఆశ

పయనించే సూర్యుడు, 01-01-2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండలను నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వెల్దండ మండల కాంగ్రెస్ నాయకుడు పిఎసిఎస్ చైర్మన్ పదవి పై ఆశలు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. వ్యవసాయ సహకార పరాపతి సంఘాలకు ఇకపై ఎన్నికలు ఉండవని నామినేటెడ్ పద్ధతిలో పాలక మండలాలను. వచ్చే సంవత్సరం జనవరిలో ప్రకటించునున్నారని సమాచారం జరుగుతుంది. మరోవైపు వెళ్లడం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వై శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవి కోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో మంతనాలు నడుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వెల్దండ మండల పిఎసిఎస్ చైర్మన్ పదవి తనకే దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.