
పయనించే సూర్యుడు న్యూస్ 01-01-2026 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, కాంగ్రెస్ శ్రేణులతో మంథని అంబేద్కర్ చౌక్ కోలాహలంగా మారింది. మంథని ఎమ్మెల్యే తెలంగాణ ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు విరుచుకుపడ్డారు. పుట్ట మధును ఉద్దేశించి మాట్లాడుతూ చదువుకోని సన్నాసి సంస్కారం లేని హీనుడు పుట్ట మధు అన్నారు. పుట్ట మధుకు జ్ఞానోదయం కావాలని మహిళ నాయకురాళ్ళు దేవునికి విజ్ఞప్తి చేశారు. నీకు రాజకీయ బిక్ష పెట్టిందే దుద్దిల్ల శ్రీధర్ బాబు కుటుంబమని గుర్తు చేశారు.శ్రీధర్ బాబు నిన్ను నమ్మితే గుండాలను రౌడీలను చేరదీశావనీ విమర్శించారు. శ్రీధర్ బాబును తిడితేనే నీకు రాజకీయ పుట్టగతులు ఉండవు అని ప్రజల్లో తేలిపోయిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నువ్వు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో కమిషన్లు తీసుకొని ఆశాస్త్రీయంగా, నాణ్యత లోపంతో, లోప భూయిష్టంగా పనులు చేయడం వల్లే కాలేశ్వరం కూలేశ్వరం అయిందని, చెక్ డ్యామ్ లు కూలిపోతున్నాయన్నారు. పుట్ట మధుకు చేతిలో అధికారం లేకపోవడంతో కమిషన్లు రాక కాకవికలం అవుతు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ధనాపేక్ష, లాభాపేక్ష, అధికార వ్యామోహం తప్ప నీకు ప్రజల శ్రేయస్సు పట్టదనీ విమర్శించారు.సహనం కోల్పోయి మాట్లాడితే సహించేది లేదని నీ బండారం మొత్తం బయట పెడతామని హెచ్చరించారు. నీ ఉనికి ఎప్పుడో ప్రశ్నార్థకమైందనీ బహుజనులే నిన్ను బర్తరఫ్ చేశారనీ ఎద్దేవా చేశారు. రెండు చేతులా సంపాదించుకొని వేయి నాలుకలతో మాట్లాడుతున్నావనీ ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలని హితోపలికారు. మంథని రాజకీయాలను బ్రష్టు పట్టించిన చరిత్ర నీదని అన్నారు. అహంకారం తలకెక్కి అవాకులు సేవకులు పేలుతున్నావు. నీ రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు, హత్య రాజకీయాలు మంథనిలో ఇక చెల్లవన్నారు. వాపును చూసి బలుపు అనుకోకు నీది గాలివాటం గెలుపు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారం దూరమై పిచ్చి పట్టి రెచ్చిపోయి మాట్లాడుతున్నావన్నారు. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి ఫ్యాక్షన్ సంస్కృతిని నెల కలిపిన చరిత్ర నీదని అన్నారు. మంథనిలో నువ్వు చేసిన అభివృద్ధి గోరంత చెప్పుకునేది కొండంత అని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. కార్యక్రమాలు జరిగినంత సేపు కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పుట్ట మధు పై నిప్పులు చెరిగారు. మూడుసార్లు ప్రజాక్షేత్రంలో ఎందుకు ఓడిపోయావు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. శ్రీధర్ బాబు కుటుంబం పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారి మాట్లాడుతున్నావనీ మండిపడ్డారు. త్రాగుబోతువైన నిన్ను మద్యం మాన్పించి మనిషిని చేసింది శ్రీధర్ బాబు కాదా అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కమాన్ పూర్ రామగిరి ముత్తారం మంథని మండలాల ప్రజాప్రతినిధులు మహిళా నాయకురాళ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత పెట్రోల్ బంకు వద్ద శ్రీపాద చౌక్ వద్ద అంబేద్కర్ చౌక్ వద్ద బస్టాండ్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.