ప్రచురణార్థం తేదీ 30-12-2025

★ కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలోచందర్ గౌడ్కు 10 వేల ఆర్థిక సహాయం ★ కానాప్రతినిధులకు కేజీ కేఎస్అభినందనలు ధన్యవాదాలు

పయనించే సూర్యుడు జనవరి 1 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)జనగామ జిల్లా చిలుపూర్ మండల కేంద్రానికి చెందిన సట్ల చందర్ గౌడ్ వయసు 35 సంవత్సరాలు రోజువారీ వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కీ కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు పై నుండి పడి నడుముకు, కాళ్లకు, వెన్నుపూసకు తలకు దెబ్బలు తగలడం జరిగింది. నిరుపేద గౌడ కుటుంబానికి చెందిన సట్ల చందర్ కు భార్య సట్ల సప్న, కుమారుడు ఉన్నారని వీరికి సంబంధించిన వివరాలు కే జి కే ఎస్ జనగామ జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య గౌడ్ ద్వారా తెలుసుకున్న కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ట్రస్ట్ సభ్యులు వెంటనే వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు ఈరోజు కానా స్థానిక వాలంటీర్లు నాతి గణేష్, బాల్నే రామచంద్రుడు కేజీ కె ఎస్ జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య చేతుల మీదుగా బాధితునికి చెక్కు అందజేశారు ముందుకి వచ్చి సహాయం చేసినందుకు కానాసంస్థని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జనగామ జిల్లా కమిటీ చిల్పూర్ గౌడ సంఘం, వారి కుటుంబం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమంలో కేజీ కేస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కనకటి రాజయ్య గౌడ్,మండల అధ్యక్షులు గనగోని రమేష్ గౌడ్, మాచర్ల ప్రవీణ్ కుమార్ గౌడ్, టి టి సి ఎస్ అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ గౌడ్,నాయకులు నారగొని వెంకన్న గౌడ్, నారగోనీ రాములు గౌడ్ , మంద సంపత్ గౌడ్ టి టి సి ఎస్ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.