ప్రతి ఉద్యోగికి పదవి విరమణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపో తుంది: రాగం నాగేందర్ యాదవ్

పయనించే సూర్యుడు, 01-01-2026 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మాదాపూర్ జెడ్పీహెచ్ఎస్ లో నిర్వ హించిన గెజిటెడ్ ప్రధానో పాధ్యాయులు మరియు మాజీ మండల విద్యాధికారి శేరిలింగంపల్లి మడపతి బసవలింగం పదవీ విరమణ సభలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రధానోపా ధ్యాయులు బసవలింగం దంపతులను శాలువా కప్పి పూలబోకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ బసవలింగం విద్యయే వృత్తిగా భావించి విద్యార్థుల అభ్యున్న తికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. తనకు ఉపాధ్యాయులు అంటే ఎంతో అభిమానం అని ఇలాంటి వృత్తిలో రాణిం చడం హెచ్ఎం చేసుకున్న అదృష్టం అన్నారు. సమాజంలో అందరి కంటే ఒక ఉపా ధ్యాయుడికి తగిన గౌరవం లభిస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మానవతా విలువలు పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలను బాగా చది వించి ఉన్నత విద్య ను అభ్యసించేలా ఉండాలని కోరారు. విద్యతోనే మనిషికి సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పీ ఆర్ టీ యూ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ రెడ్డి,గౌరవ అధ్యక్షులు రాఘవేందర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ తదితర పాఠశాల ఉపా ధ్యాయుని ఉపాధ్యా యులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.