ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజం

★పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావాలి మండల విద్యాధికారి ఇ వెంకట్ రెడ్డి.

పయనించే సూర్యుడు, జనవరి 01, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. ఉపాధ్యాయులకు పదవి విరమణ సహజమని ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేస్తే పాఠశాలలకు పూర్వవైభవం వస్తుందని మండల విద్యాధికారి ఈ వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బచ్చన్నపేట లో పని చేయుచున్న జీవశాస్త్ర ఉపాధ్యాయు రాలు జీవనకుమారి పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమము బుధవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించగా మండల విద్యాధికారి ఇర్రి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా గ్రామ సర్పంచ్ అల్వాల నరసింగరావు , ఆదర్శ పాఠశాల చైర్మన్ లత , ఉపసర్పంచ్ రజిత , వార్డ్ మెంబర్ కర్రె ప్రశాంత్ హాజరయ్యారు. జీవనకుమారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గౌరవ అతిథులు గా టీ యస్ పి ఆర్ టీ యు జిల్లా భాద్యులు కొల్ల మహిపాల్ రెడ్డి , నూకల ఎల్లారెడ్డి విచ్చేశారు. అలాగే అతిథులు గా మండల ఉపాధ్యాయ సంఘ భాద్యులు పృథ్వీరాజు, సంతోష్, యాకస్వామి, మల్లారెడ్డి, కనకయ్య ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అతిథులందరికీ జీవనకుమారి సేవలు కొనియాడారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జీవన కుమారి నిబద్ధతతో పనిచేసేవారని, వారు విరమణ పొందటం విద్యార్థులకు తీరని లోటు అని, వారు పిల్లలకు చక్కగా జీవ శాస్త్రం బోధించే వారని పేర్కొన్నారు.అలాగే ముఖ్య అతిథి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 35 సంవత్స రాలు విద్యారంగానికి సేవలందించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు, ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నత మైనదని,అందరూ ఉపాధ్యాయులు నిబద్ధత తో పనిచేస్తే విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన వారు అవుతారని, జీవకుమారిని ఈ సందర్భంగా అభినందించారు. సర్పంచ్ అల్వాల నర్సింగరావు మాట్లాడుతూ జీవనకుమారి సేవలు కొని యాడారు. అలాగే పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి అన్నివేళలా అందుబాటులో ఉండి సహకరిస్తానని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల భాద్యులు మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో పనిచేసిన నాడు ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని పొందుతాయని, పదవి విరమణ అనేది సహజమని,ఉద్యోగులు ఎన్నడైనా విరమణ పొందక తప్పదని కానీ వారు చేసిన సేవలు చిరస్థాయిగా ఉండేవిధంగా పనిచేయాలని తెలిపారు