పయనించే సూర్యుడు, కోరుట్ల 01-01-2026 వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను “వర్కింగ్ జరలిస్ట్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి” “రణం” వార్త దినపత్రిక ఎడిటర్ ఆకుల మల్లికార్జున్,చిట్యాల సాయి కృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. పాత్రికేయుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ మేము చేసే అభివృద్ధి పనుల వల్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని,ప్రతి కుటుంబం లో సభ్యుడు మెదులుతూ ప్రభుత్వం నుండి ప్రతి పౌరునికి చేరేలా కృషిచేస్తున్నామని,ఈ మధ్య తీసిన 252 జీవో విషయంలో జర్నలిస్ట్ లు లబ్ధిపొందెలా సవరణలు చేయించేందుకు కృషి చేస్తానని మంత్రి తో చర్చిస్తానని అర్హత గల ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం జరిగేలా చేస్తానని హామీఇచ్చారు. అనంతరం విప్ ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు విజయ్ పాటిల్ ,శ్రీకాంత్ ,చిట్యాల సాయి కృష్ణ ,ప్రేమ్ ,గడ్డం కిరణ్, పిట్ట మధు ,గణేష్, పాత్రికేయులు పాల్గొన్నారు.