ప్రమాద వశాత్తూ మరణించిన 3 వ్యక్తుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పయనించేసూర్యుడు దస్తగిరి రిపోర్టర్ 01-01-2026 నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అవిటి నర్సింలు, జిన్నా మల్లేష్, జిన్నా మహేష్, లు నర్సాపూర్ గ్రామ శివారులో 3 రోజుల క్రితం ప్రమాద వశాత్తూ బైక్ పై నుండి పడి మరణించడంతో నేడు వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్లకు దైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే శ్రీ మహారెడ్డి రెడ్డి భూపాల్ రెడ్డి వారి వెంట సర్పంచ్ హనుమంతు,మాజీ ఎంపీటీసీ శ్రీను పటేల్, మాజీ సర్పంచ్ రవీందర్, గుండు తండా బాపు రావు, నాయకులు దస్తగిర్ తదితరులు ఉన్నారు.