ప్లాస్టిక్ వ్యతిరేక నినాదాలతో విద్యార్థుల ర్యాలీ

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి1 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండల కేంద్రంలోని వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎస్ఎల్ యం లీడ్ కార్యక్రమంలో భాగంగా గురువారం అనంతసాగరం గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజలకు, పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి–2 కాటంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. అలాగే పాఠశాల కరస్పాండెంట్ షేక్ ఖాదర్ వలి, డైరెక్టర్ షేక్ జిలాని, ప్రధానోపాధ్యాయులు గుత్తి పెంచలప్రసాద్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.