పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 1 బోధన్ : బోధన్ మండలం నాగన్ పల్లి గ్రామాల నుంచి నడపాలని కోరుతూ బుధవారం ఏఐఎస్బి విద్యార్థి సంఘం నాయకులు బస్ డిపో సూపర్డెంట్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ బస్సు రాకపోవడం వలన అటు సాలూర ఇటు బోధన్ కు విద్యార్థిని విద్యార్థులు సమయానికి పాఠశాల మరియు కళాశాలలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు గ్రామంలోకి రాకుండా బైపాస్ రోడ్డు మార్గాన వెళ్తున్నాయని అన్నారు. విద్యార్థులు గ్రామం నుండి బైపాస్ రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లే సమయానికి బస్సులు వెళ్లిపోవడంతో విద్యార్థులు సమయానికి పాఠశాల మరియు కళాశాలలకు చేరలేకపోతున్నారని తెలిపారు. గ్రామాల గుండా బస్సులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ కార్యదర్శి రాజన్న, అధ్యక్షులు గంగా శంకర్, విద్యార్థి సంఘం నాయకులు సతీష్, వంశీ, రెహమాన్ తదితరులు ఉన్నారు.