మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వాహనం జప్త్

★ డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి. ★ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ★ హుజురాబాద్ టౌన్, రూరల్, సీఐ, ఎస్సైలు హెచ్చరిక.

పయనించే సూర్యుడు : 01-01-2026 : హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతపై పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు సిద్ధమయింది. పట్టణ పోలీస్ మందుబాబులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరినామా వాహనాల జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. హుజురాబాద్ లో తప్పనిసరిగా అమలు చేస్తామని హెచ్చరించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ సృష్టించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, బాధ్యతతో జరుపుకోవాలని హుజూరాబాద్ పట్టణ,రూరల్ సిఐలు, ఎస్ఐలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.