పయనించే సూర్యుడు జనవరి 1 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు విధానం ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని జనగామ జిల్లా బిఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి మాట్లాడుతూ యూరియా బస్తాలు సరఫరా చేయడం చేతకాని రేవంత్ సర్కార్ అని, స్మార్ట్ ఫోన్లు వాడడం రాని రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అని, రైతులకు యూరియా సరఫరా యాప్ ద్వారా కాకుండా నేరుగా సులభంగా చేయాలని, యాప్ వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడాలని, ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడనాడీ వ్యవసాయానికి మద్దతుగా నిలువాలన్నారు