పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 01.01.2026 అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం చౌడేపల్లి శాఖ తరపున మండలంలోని 9ఉన్నత పాఠశాలల్లో 400 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో భాగంగా యుటిఎఫ్ కామ్రేడ్స్ అయినటువంటి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే తయారు చేయబడిన 10వ తరగతి మెటీరియల్ విద్యార్థులకు అందజేయడం జరిగినది. ఈ మెటీరియల్ ద్వారా విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారనే ఉద్దేశంతో అందజేశారు అదేవిధంగా ఉన్నత పాఠశాలలోని విద్యార్థులలో2025-26 విద్యా సంవత్సరంలో 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించిన విద్యార్థికి రూ 1,01,116లు ప్రోత్సాహక బహుమతిగా అందజేయడం జరుగుతుందని ప్రతి ఒక పాఠశాలలోనూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇ. సహదేవయ్య ప్రధాన కార్యదర్శి జి. లోకనాథ్ రెడ్డి, కోశాధికారి డి. రమేష్ ,జిల్లా కార్యదర్శి సి. జగన్మోహన్ రెడ్డి యుటిఎఫ్ నాయకులైన కె. శంకరయ్య,సి. సూర్య ప్రకాష్ యం.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు