పయనించే సూర్యుడు, కోరుట్ల 01-01-2026 కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద మక్కన్ ఠాగూర్ సింగ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్వర్ణకార మరియు వ్యాపార యువజన సంఘ సభ్యులు హైదరాబాద్ అసెంబ్లీ సమావేశo లో మక్కన్ సింగ్ ఠాగూర్ స్వర్ణకార మరియు ఆవుసుల కంసాలి వృత్తి వారి ఆవేదన గురించి ఎంతో కష్టపడి చిన్న చిన్న బంగారు ఆభరణాలు తయారు చేయడంతో వారు వృత్తి సమయంలో కళ్ళు దగ్గరగా చేసి చూడడం మరియు పని వల్ల ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్న స్వర్ణకార సభ్యులను రాష్ట్ర ప్రభుత్వo 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో స్వర్ణకార సంఘ అద్యక్షులు ఇందూరి ప్రసాద్, ప్రదాన కార్యదర్శి శ్రీరాముల ప్రశాంత్, జిల్లా ప్రతినిధి కనపర్తి సత్యనారాయణ, రాష్ట్ర స్వర్ణకార కార్యదర్శి పబ్బోజి లక్ష్మినారాయణ, మండలోజు రవిందర్, వ్యాపార అద్యక్షులు బేజ్జారపు పెద్దోళ్ళ శ్రీనివాస్ , కార్యదర్శి తొగిటి రమేష్ యువజన అద్యక్షులు దురిశెట్టి కరునాకర్ సదానంద చారి, గిన్నెల శ్రీకాంత్,శ్రీరాముల శ్రీనివాస్,దురిశెట్టి నాగరాజు, సాయికృష్ణ,మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు