పయనించే సూర్యుడు జనవరి 1 కరీంనగర్ న్యూస్: (కరీంనగర్ ప్రతినిధి దుర్గం మోహన్ ) బోయినపల్లి మండలo విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల కనుకయ్య మాట్లాడుతూ తను ప్రమాణ స్వీకారం రోజున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తన బాధ్యతగా చెప్పినట్టు తొలిరోజే అమలు చేసిన ఘనత మన గ్రామ సర్పంచ్ విలాసాగర్ గ్రామ ప్రజల అందరి ముందు రూపాయికే 20 లీటర్ల త్రాగునీరు మరియు గ్రామంలో ఆడపిల్ల పుడితే రూపాయిలు 5000 ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్న మన సర్పంచ్ ఏనుగుల కనుకయ్య
సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్రామంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న సర్పంచ్ ఏనుగుల కనకయ్య కేవలం ఒక్క రూపాయికే 20 లీటర్ల త్రాగునీరు శుద్ధి చేసిన త్రాగునీటినీ గ్రామ ప్రజల అందరికీ అందించారు మరియు గ్రామంలో ఆడపిల్ల పుడితే 5000 ఇస్తానని ఆడిన మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఆడపిల్ల జన్మించిన వెంటనే చెక్కును అందజేసిన విలాసాగర్ ముద్దు బిడ్డ మన గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య వెంటనే గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఇచ్చిన మాట తప్పకుండా శభాష్ అనిపించుకున్నాడు అన్నా అంటే మీ ఇంటి పెద్ద కొడుకులాగా స్పందించే బాధ్యతగల వ్యక్తి మన విలాసాగర్ సర్పంచి ఏనుగుల కనకయ్య ఇచ్చిన హామీలను తొలిరోజే అమలు చేసి గ్రామ ప్రజలందరినీ ఆశ్చర్యపరిచారు మరియు గ్రామంలో ఉన్న సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజీలు విధి దీపాలు గ్రామం పరిశుద్ధంతో భాగంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతానని అన్నారు విలాసాగర్ గ్రామాన్ని జిల్లా లోనే మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు నేను 24 గంటలు గ్రామంలోనే ఉంటాను గ్రామ సేవ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను నన్ను గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
