విద్యార్థి నాయకులపై రౌడీషీట్లు ఎత్తివేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ 01-01-2026 శర్మాస్ వలి మండల రిపోర్ట్ యాడికి విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి–యువజన నాయకులపై రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ యాడికి మండలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ తాడిపత్రి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ మాట్లాడుతూ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శాంతియుత ఉద్యమాలు నిర్వహించిన నాయకులపై పాత కేసులను ఆధారంగా చూపి రౌడీషీట్లు తెరవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అణిచివేతకు పాల్పడటం తగదన్నారు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులపై అనేక కేసులు ఉన్నా వారికి వర్తించని నిబంధనలు విద్యార్థి నాయకులకు వర్తింపజేయడం అన్యాయమని విమర్శించారు. తక్షణమే రౌడీషీట్లు ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వినోద్, సురేష్, రమేష్, కిరణ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.