విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల సందర్శన

★ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన విద్యార్థులు.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 1 బోధన్: సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మండల కేంద్రానికి చెందిన కన్నె హన్మండ్లు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. బుధవారం జీవశాస్త్ర కాంప్లెక్స్ సమావేశంకు హాజరైన ఉపాధ్యాయులు మరియు సాలూర అగ్రికల్చర్వెకేషనల్ విద్యార్థుల బృందం వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నాటు వేసే పద్ధతిని స్వయంగా తెలుసుకున్నారు. నాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాలలో నారు తీసి నాటు వేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మాకు నాటు వేయడం ,వరి కోయడం మరియు వ్యవసాయ పనులు తెలుసని విద్యార్థిని విద్యార్థులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఎంఈఓ రాజీమంజుష మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నుముకని రైతు లేనిది రాజ్యం లేదు అని అన్నారు. జీవశాస్త్ర కాంప్లెక్స్ సమావేశమునకు ఉపాధ్యాయులు విట్టల్ కాంబ్లే, గంధం సాయిలు, అరుణ్ కుమార్, విజయ్ కుమార్, అబ్బయ్య, థామస్, నాగేష్, రామ్, గోగినేని శ్రీనివాస్, అనురాధ, సుజాత, సంధ్య, భాస్కర్, రమణ, అగ్రికల్చర్ వెకేషనల్ ఉపాధ్యాయులు మేడి రవి, ఐటి వెకేషనల్ ఉపాధ్యాయులు జాదవ్, అక్షయ్, విద్యాసాగర్, సాయిలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.