పయనించే సూర్యుడు 01-01-2026 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలల 15 రోజుల హుండీ ఆదాయం నగదు 8,04,270 రూపాయలు రాగ, నాణెములు 64,472 రూపాయలు కలిపి మొత్తం 8,68,742 రూపాయల ఆదాయం వచ్చిందని, దానిని యూనియన్ బ్యాంకు లో జమ చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమకొండ డివిజన్ పరిశీలకులు అనిల్, కొత్తకొండ గ్రామ సర్పంచ్ సిద్ధమల్ల రమ రమేష్, ఉపసర్పంచ్ తాళ్లపల్లి యాదగిరి, వార్డు సభ్యులు, గ్రామంలోని ప్రముఖులు, భక్తులు, రాజరాజేశ్వర సేవాసమితి, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
