శ్రీ గ్లోబల్ హైస్కూల్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు .

పయనించే సూర్యుడు 01-01-2026, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామం శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. 2025 కు వీడ్కోలు చెబుతూ… 2026 కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందమైన ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం దివాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, వాహిని మరియు పాఠశాల ప్రిన్సిపల్ రామారావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *