సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట

పయనించే సూర్యుడు న్యూస్: (పెద్దపల్లి జిల్లా) సెంటినరీ కాలనీ, జనవరి-01:- సింగరేణి సంస్థ సంక్షేమానికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలకు ఏప్పుడు వెనుకాడదని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అన్నారు.స్థానిక జి.యం కార్యాలయ నందు సుమారు 10 లక్షల రూపాయల వ్యయము తో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ ను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ సంక్షేమానికి ఎప్పుడు వెనకాడదని, జీ.యం కార్యాలయానికి వివిధ పనుల పై వచ్చే ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, సంస్థ పరంగా నిర్వహించే కార్యక్రమాల కోసం, జి.యం కార్యాలయ ఆవరణలో నిర్మించిన విశాలమైన మల్టీ పర్పస్ హాల్ ను అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేశారు.కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకర రావు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్ర రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఎస్వోటుజిఎంలు యం.రామ్మోహన్, బండి సత్య నారాయణ, ఏరియా ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ అధికారి జె.రాజశేఖర్, సివిల్ డిజీఎం రాజేంద్ర కుమార్, విభాగాధిపతులు రాజా రెడ్డి, మురళి కృష్ణ, సుదర్శనం, జనార్ధనరెడ్డి, సురేఖ, ఐలయ్య, రాజేశ్వరి, లతో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.