పయనించే సూర్యడు / జనవరి 01/ కాప్రా ప్రతినిధి సింగం రాజు : మల్లాపూర్ డివిజన్ భవాని నగర్ కాలనీలోని సహస్ర హై స్కూల్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలని సూచించారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు సమానంగా నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల యాజమాన్యం చేపడుతున్న విద్యా కార్యక్రమాలను అభినందిస్తూ, విద్యార్థుల సర్వాంగీణ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సందీప్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోయలకొండ రాజేష్‌తో పాటు స్కూల్ యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.