కన్నుల పండువగా పుష్పయాగం

పయనించే సూర్యుడు, కోరుట్ల జనవరి 2 కోరుట్ల పట్టణంలో మండల దీక్ష మహోత్సవాలలో భాగంగా గురువారం రోజు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పాలెపు రాముశర్మ గారి వైదిక నిర్వహణలో అయ్యప్ప మూల విరాట్టుకు పంచామృతాలతో అభిషేకం చేసి పుష్పయాగం-లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు విజ్ఞప్తి :- 3కోట్ల వ్యయంతో త్వరలో నిర్మించనున్న శివాలయ నిర్మాణంలో తమవంతు సహకారం అందించి పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాము. అంబటి శ్రీనివాస్ గురుస్వామి అధ్యక్షులు మరియు కార్యవర్గం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం కోరుట్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *