మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మణ ఇంటి ఆవరణలో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు

★ మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ,రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న

పయనించే సూర్యుడు జనవరి 02 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ లోమంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్,రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న ఇంటి ఆవరణలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తధానంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన పార్టీ మండల అధ్యక్షులకు, జనసేనపార్టీ నాయకులకు, కార్యకర్తలకు సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు సందేశం ఇస్తూ అందరూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో సుఖ జీవనం సాగించాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని, రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కె పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుందని వాల్మీకి లక్ష్మన్న తెలిపారు. ఈ 2026 కొత్త సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని సంక్షేమ పథకాలు సూపర్ గా అమలు చేస్తున్నారని వాల్మీకి బి లక్ష్మన్న ధీమా వ్యక్తం చేశారు. తదనంతరం జాలాడి జైపాల్ కొత్త సైకిల్ మోటార్ను వాల్మీకి బి లక్ష్మన్న చేతుల మీదుగా పని చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పెడబూర్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు జి బజారి ( అబ్రహం ), కోసిగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు సి వీరారెడ్డి, కౌతాళం మండల నాయకులు చిన్న, ఎర్రి స్వామి, వై నాగేష్, ఈరన్న, ఏసోబు మరియు కోసిగి మండలం నుంచి కరీం స్వామి, నరసింహులు, పెద్ద కడబూర్ మండలం నుంచి పెద్ద కడూరు సింగల్ విండో డైరెక్టర్ ఎస్ అనిమేష్, ఉపాధ్యక్షుడు ఆలీ భాష, ప్రభుదాస్, లింగన్న, జైపాల్, బంగారయ్య మరియు మంత్రాలయం మండలం నుంచి మంత్రాలయం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బివి రవిచంద్ర, మిడిల్దిన్ని రాగు, గిడ్డయ్య, పవన్, దుల్లయ్య, వెంకటేష్, అడవి రాగు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.