
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జనవరి 3 ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్రఅధ్యక్షులు తుష్టి జోగారావ్ నేత్రుత్వంలో.. సంఘ బాద్యులు కింది స్థాయి ఉద్యోగులను, సిబ్బందిని వేధింపులకు గురించేస్తున్న లక్ష్మిపురం వైద్యాధికారి, డా. మొరళి కృష్ణ, అండగా ఉన్న పాడేరు డి ఎం హెచ్ ఒ లను, ఏజెన్సీ నుండి పంపించివేయాలి అని డిమాండ్ చేస్తూ చింతూరు ఐ టి డి ఏ పి ఒ శుభం నోఖ్వాల్ ఐ ఏ ఎస్ ని కలిసి విన్నవించడం జరిగింది. ఈ సందర్బంగా సలహాదారులు మడివి నెహ్రూ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా, డా. మొరళి కృష్ణ లక్ష్మిపురంలో వైద్యాధికారిగా జాయిన్ ఐన నాటి నుండి మహిళా ఉద్యోగులను క్యాడర్ తో సంబంధం లేకుండా తోటి డాక్టర్ నుండి ఆశా కార్యకర్త వరకు సిబంది అందర్నీ రకరకాలుగా వేదిస్తున్నారని, డ్రాయింగ్ ఆఫీసర్ గా అక్రమంగా తప్పుడు పద్దతిలో పాడేరు డి ఎం హెచ్ ఒ తో కుమ్మకై బాధ్యతలు తీసుకున్న నాటి నుండి శృతిమించిదని స్పష్టం చేశారు. గత నవంబర్లో ఆదివాసీ మహిళా ఉద్యోగులను ఉద్దేశించి "ఉద్యోగం కాబట్టి ఇక్కడ మీతో కలిసి పనిచేస్తున్నాను కానీ మా ఇళ్లల్లో గడపకూడా తొక్కనివ్వం" అని అస్పృస్యతతో మాట్లాడి కించపరిచారాని, మరుసటి రోజే ఆదివాసీ సంఘాలు నీలాదీయగా.. "మరోసారి ఇటువంటి తప్పు జరగదని క్షమాపణలు" చెప్పారని, అయినా కుక్క తోక వంకర అనే చందంలో బుద్ది మార్చుకోకుండా వెర్రివేశాలు కొనసాగిస్తు.. వేధింపులు శృతిమించిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. కావున ఆదివాసీ ఉద్యోగులను చులకన భావంతో చూస్తూ, మహిళా ఉద్యోగులను వేదిస్తూ.. అక్రమంగా చేసిన ట్రాన్స్వర్లను వెంటనే రద్దు చేయాలని, వేధింపులకు పాల్పడుతున్న లక్ష్మిపురం వైద్యాధికారిని ఏజెన్సీ నుండి పంపించివేయాలని. అలానే వేధింపులకు అండగా ఉన్న పాడేరు డి ఎం హెచ్ ఒ ని కూడా ఏజెన్సీ నుండి పంపించివేయాలి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బాధితులు, జి. చంద్రమ్మ, పి. కుమారి, కె. సమ్మక్క, పి. నాగమణి తోపాటు మానె జయ, మానె రాంప్రసాద్, జాయింట్ సెక్రెట్రి జి. సీతమ్మ, డివిజన్ ప్రధాన కార్యదర్శి బి. శశికల, టి. సీతమ్మ, కరక రాజేష్, ఉత్తర, సోడి సత్యనారాయణ, కారం సుందర్, మానె విజయ్, తదితరులు పాల్గొన్నారు.