పయినించే సూర్యడు న్యూస్ టెక్కలి ప్రతి నిది జనవరి 03 టెక్కలి మండలం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద వాడవలస ఆనంద్ అనే ఆసరాలేని వృద్ధుని మృతదేహాని శుక్రవారం పోలీసులు గుర్తించారు.. ఇతనిది టెక్కలి మండలం కంట్రగాడ గ్రామం అని తెలియజేశారు. పంచాయితీ, పోలీస్ శాఖ అధికారులు, పంచాయితీ కార్మికులతో ఖననం చేయించారు. ఈ ఖననానికి టెక్కలి అభయం యువజన సేవా సంఘం వాళ్లు ఆర్ధిక సాయం సమకూర్చారు.. ఇటువంటి అనాధ మృతదేహాల ఖననం కి పలుమార్లు ఆర్ధిక సాయం అందించినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు.. మన టెక్కలి నియోజక వర్గం లో ఎక్కడైనా ఆసరాలేని, అనాథల మృతదేహాల దహన సంస్కరణకు సాయం అందించడానికి మేము సిద్ధంగా గా ఉంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభయం సేవా సంఘం సభ్యులు యన్ సింహాచలం , రాజేష్ పట్నాయక్ పాల్గొన్నారు.