పయనించే సూర్యుడు జనవరి 03 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండల పరిధిలోని పాత లింగాయిపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అర్జున్ పీరమ్మ కుటుంబ సభ్యులకు శుక్రవారం రోజు తమ వంతుగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కార్యకర్తలు రూ.15000/- ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సిద్ధప్ప మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయిపల్లి గ్రామ సర్పంచ్ నిమ్మలగారి సిద్దప్ప, ఉప సర్పంచ్ నీరుడి రాజు, కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఇట్టబోయిన దస్తయ్య,సెక్రటరీ మాదగల్ల సిద్దిరాములు, వార్డు మెంబర్లు మాదగాళ్ల రామరాజు, ఇట్టబోయిన రాములు, పెద్దోళ్ల రవికుమార్, కార్యకర్తలు బెస్త యాదగిరి, లక్ష్మపురం మల్లేశం, పట్లోళ్ళ ఉమాకాంత రెడ్డి, నిమ్మళగారి రవి, నిమ్మళ సాయిబాబా, మాదగల్ల సాయిలు, భూపతి సాయిబాబా, చింతకాయల రమేశ్, భూపతి బ్రహ్మం, తుమ్మల దస్తయ్య, బెస్త ప్రవీణ్, పెద్దోళ్ల దుర్గయ్య, భూపతి రమేష్, నీరుడి భాగయ్య, కలాలి సాయగౌడ్, చింతకాయల రాజేందర్, మాదగల్ల శేఖర్, తుమ్మల రమేశ్, నీరుడి బ్రహ్మం, చింతకాయల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.