అమ్దాపూర్ లో కరెంటు సమస్యల పరిష్కారానికి చర్యలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలోని బోయి కాలనీలో కరెంటు సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.శుక్రవారం అధికారులు నాయకులతో కలిసి కాలనీలో పర్యటించి సమస్యలను గుర్తించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాలనీలో కరెంటు సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సర్పంచ్ పోరెడ్డి గంగాధర్ అన్నారు.గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పిసిసి డెలిగేట్ గంగా శంకర్ అన్నారు.ప్రభుత్వం అమలు పరుచుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరాజ్ పల్లి సంజీవరెడ్డి,జిల్లా కార్యదర్శి బోర్ర పల్లన్న,లైన్ ఇన్స్పెక్టర్ రాజు,లైన్మెన్ తదితరులు ఉన్నారు.