పయనించే సూర్యుడు జనవరి 3, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) ప్రజల దగ్గరికి ప్రభుత్వం రావాలి అదే మా నినాదం చెప్పింది చేసి చూపించే కూటమి ప్రభుత్వం ఇదే” – కో–కో ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి)ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కో–కో ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) ఆధ్వర్యంలో శుక్రవారం కరప మండలం అరట్లకట్ల గ్రామంలో పెద్ద ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రథసారధి మంత్రి నారా లోకేష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ప్రధాన సమస్యలు పీఎం కిసాన్ డబ్బులు పడటం లేదు దీపం పథకంలో వర్తించట్లేదని ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ఇల్లు స్థలాలు, డ్రైనేజీ నిర్మాణం, వైద్య సహాయం,బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేరు మార్పులు-చేర్పులు, పింఛన్లు, వంటి అంశాలపై మొత్తం 143 వినతులు అందాయి. వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకరపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ,ఏటుకూరి నాగమణి, కంచి మూర్తి లావణ్య, పొదరపు ఉమా, గుడాల లోవరాజు, దవులూరి కృష్ణ కాంత్,జనసేన గ్రామ అధ్యక్షులు బత్తుల సతీష్, ఎర్ర మాటి మార్కండేయులు, మందరపు చిట్టిబాబు, సవరపు సత్తిబాబు, వేగుళ్ల రామకృష్ణ, కురుకురి గోపాలకృష్ణ, మడిపల్లి ప్రకాష్, ఎర్ర మాటి శ్రీను, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు