
పయనించే సూర్యుడు జనవరి 03 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని జిల్లా సాధన ప్రచారంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలో జనవరి ఒకటో తేదీన పర్యటించిన జేఏసి నాయకులు నూర్ అహ్మద్ ఆధ్వర్యాన ప్రచార కమిటీ. విద్యార్థి సంఘం నాయకులు రాజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక కోసిగి బస్టాండ్ వద్ద ఆదోని జిల్లా సాధన జాయింట్ ఆక్షన్ కమిటీ పోస్టర్ల విడుదల కార్యక్రమం జరిగింది.తర్వాత నాయకులు ప్రసంగించారు కర్నూలు జిల్లాలో భాగంగా ఉండి డెబ్బై ఏళ్లుగా ఆదోని ప్రాంతము దగా పడుతున్నదని దీనికి కారణం కర్నూలు జిల్లా పాలకులు, యంత్రాంగము నిర్లక్ష్యం తప్ప మరోటి కాదు అని ఈ నిర్లక్ష్యం నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం ఆదోని జిల్లా ఏర్పాటు మాత్రమే అని తెలిపారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో మంత్రాలయ నియోజకవర్గంలో గ్రామాల్లో పారిశుద్యం పడకేసిందని గ్రామాలకు గ్రామాలు సుగ్గి (వలసలు) పోయే దుస్థితి ఏర్పడిందని దీని వల్ల కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తుంగభద్ర నది మంత్రాలయం నియోజక వర్గంలో ప్రవహిస్తున్నా ప్రతి పొలానికి సాగునీరు ఎందుకు అందడం లేదని నూర్ అహ్మద్ ప్రశ్నించారు. ఆదోని జిల్లా ఏర్పడితే ఆదోని ప్రాంతంలోని ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ,ఆలూరు నియోజకవర్గాలలో ప్రతి పొలానికి సాగునీరు అందించి ప్రతి రైతుకు ఆదాయం గణనీయంగా పెంచవచ్ఛని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికీ తాగునీరందించవచ్చు, అలాగే ఇక్కడే పరిశ్రమలు ఏర్పడి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కలగడం వల్ల సుగ్గి పోవాల్సిన దుస్థితి తప్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదోని జిల్లా ఇవ్వక పోతే ఎన్నికలు బహిష్కరించటానికి సిద్ధంగా ఉండాలని నూర్ అహ్మద్ పిలుపునిచ్చారు ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వంలో కదిలిక రావడం శుభపరిణామం అని ఇదే స్ఫూర్తితో ఆదోని జిల్లా ఏర్పడే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నాయకులు రాజు తదితరులు మాట్లాడుతూ కర్నూలుకు వెళ్లి కోసిగికి తిరిగి వచ్చే సరికి రాత్రి బస్సులు దొరికక ఎమ్మిగనూరు బస్టాండ్ లో పడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అని అదే ఆదోని జిల్లా అయితే ఆదోని జిల్లా కేంద్రానికి రైలు లేక బస్సులో అరగంటలోపే చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆదోని జిల్లా ఏర్పడితే వేలాదిమంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జిల్లా కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా దానికనుగుణంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్ అహ్మద్, నరేంద్ర యాదవ్, షకీల్, అయ్యాళప్ప, కుమార్, సద్దాం హుసేన్, కోసిగి యువత యం.రాజు, కోసిగయ్య కరీం స్వామి, నాగేష్, ప్రతాప్, ప్రకాష్, రాము, గోపాల్, హుసేన్ బాషా మరియు గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.