ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ను అవమానించిన మార్కెట్ యార్డ్ సెక్రెటరీ.

పయనించే సూర్యుడు జనవరి 3 డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని మార్కెట్ యార్డ్ బడ్జెట్ సమావేశంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. వైస్ చైర్మన్ విజయ్ కృష్ణకు ప్రత్యేక కుర్చీ కేటాయించేందుకు సెక్రెటరీ నిరాకరించడంతో డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల పేరుతో తమను అవమానిస్తున్నారని మండిపడుతూ, వారంతా నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై పాలకవర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.