ఆలూరు నియోజకవర్గంలో డి ఎస్ ఎప్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది

ప్రయాణించే సూర్యుడు రిపోర్టర్ ఎరుకుల మహేష్ ) జనవరి 3 ఆలూరు జూనియర్ కళాశాలలో డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ బాలు సమక్షంలో ఆలూరు మహిళా కన్వీనర్ గా ఉష, కో కన్వీనర్ గా రేఖ అలాగే ఆలూరు డివిజన్ అధ్యక్షుడు యుగేందర్ మండల కార్యదర్శి నవీన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో విద్యారంగ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధమవుతామని అలాగే ఈ ఆలూరు నియోజకవర్గంలో విద్యారంగ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని ఇప్పటికైనా ఈ ప్రాంతంలో విద్యారంగ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా వ్యవస్థ పైన ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టాలని డి ఎస్ ఎప్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో అమృత స్రవంతి అక్షయ అలాగే కిరణ్ రమేష్ అభిరామ్ తదితరులు పాల్గొనడం జరిగింది