అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను కలిసిన బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ ఏకాంబరం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మదనపల్లె అన్నమయ్య జిల్లా జనవరి 03.01.2025 పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న మరియు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి నూతనముగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరు నిశాంత్ కుమార్ ను, మర్యాద పూర్వకముగా కలిసి దేవస్థానమునకు శ్రీ అమ్మవారి దర్శనార్ధము విచ్చేయవలసినదిగా ఆహ్వానించారు ఈ కార్యక్రమములో అన్నమయ్య జిల్లా, దేవదాయ శాఖ, సహాయ కమీషనరు విశ్వనాధ్ దేవస్థాన అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.