
పయనించే సూర్యుడు జనవరి 03, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). ప్రభుత్వ జూనియర్ కళాశాల నాగులవంచ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏడు రోజుల ప్రత్యేక శీతాకాల శిబిరం తిరుమలాపురం లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నవీన్ బాబు ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ ఖమ్మం జిల్లా డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమలపురం సర్పంచ్ చాపలమడుగు వీరబాబు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ సేవ పథకం 1969ప్రారంభమైందని తాను కూడా గతంలో నాగలవంచ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా పని చేశానని. విద్యార్థులు సమాజసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ బాబు మాట్లాడుతూ చదువుతోపాటు సామాజిక దృక్పథం కూడా ఉండాలని అందరితో ఒంటరిగా ఉండకూడదని సమాజంలోనే ఉండాలని వివరించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ కె .రవి బాబు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలతో పాటు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని, ఈ వారం రోజుల శిబిరంలో గ్రామస్తులందరితో కలిసి వారి సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలని సామాజిక సర్వే ద్వారా ఒక నివేదికను మండల అధికారులకు అందించాలని పిలుపునిచ్చారు, కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా విద్యార్థులలో మార్పు రావాలని వారు సమాజంతో మమేకం అవ్వాలని అవ్వాలని ఏడు రోజుల శిబిరాన్ని గ్రామస్తులందరితో కలిసి సామాజిక అంశాలు బాల్య వివాహాలు డ్రగ్స్, మూఢనమ్మకాలు ,వంటి వాటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని వివరించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థుల్లో మార్పు కలగాలని సేవా దృక్పథం పెంపొందించాలని పిలుపునిచ్చారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి మల్లయ్య మాట్లాడుతూ జాతీయ సేవా పథకం అనేది దేశస్థాయిలో విద్యార్థులను సమాజంలో భాగస్వాములుగా చేసే ఒక జాతీయ సంస్థ అని విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని చదువుతోపాటు సామాజిక అంశాల్లో కూడా ముందుండాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలపురం ఉపసర్పంచ్ జి .నాగమణి. పంచాయతీ సెక్రెటరీ జి. ఉమారాణి . ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె .స్వాతి గారు. కళాశాల అధ్యాపకులు వరప్రసాద్, అల్లూ విజయ్ ,వెంకట్ రెడ్డి ,రాంబాబు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వీరాంజనేయులు, ఐలేశ్వర వేణుగోపాల్ సాయి పద్మావతి సూరారెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.