కల్వరి టెంపుల్ లో నూతన సంవత్సర ఆరాధన, వేడుకలు

★ రంగాపూర్ గ్రామంలో డాక్టర్.పి.ఆర్ నెల్సన్ ఆధ్వర్యంలో..

పయనించే సూర్యుడు : జనవరి 3: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : హుజురాబాద్ రంగాపూర్ కల్వరి టెంపుల్ లో డా.పి.ఆర్ నెల్సన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఆరాధన మరియు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేక వ్యాఖ్యా సందేశం అందించడానికి గుంటూరు నుండి డాక్టర్ చెల్లి అశోక్ కుమార్ హాజరై సుత్తి ఆరాధన మరియు ప్రత్యేక సందేశం అందించారు. క్రీస్తుపూర్వం, క్రీస్తు శకం గణంకాల ద్వారానే ఈ నూతన సంవత్సరంలో, ఈ క్యాలెండర్స్ ఏర్పాటు చేశారు కాబట్టి క్రీస్తు పుట్టక మరియు ఆయన చేసిన సేవలు ప్రపంచానికి ఎంతో దోహతపడ్డాయని ఆయన చూపిన మార్గం ప్రపంచశాంతికి ఎంతో దారి చూప్పిందని బోధించారు. చర్చి ఫాదర్ హాజరై ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర బైబిల్ వాగ్దానాలను అందజేసి, ప్రత్యేక ప్రార్థనలు, సంఘ క్వయర్ ప్రత్యేక పాటలు, పిల్లల నాట్యాలు,యూత్ స్కిట్స్ క్రైస్తవుల తోపాటు హాజరై ప్రజలను ఆకట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ బండ ప్రసాద్ చర్చి సభ్యులలో పేదవారికి అందించిన చీరలను అతిధులైన డాక్టర్ అశోక్ కుమార్ పంపిణీ చేశారు. హాజరైన అతిధులతో నెల్సన్ దంపతులు కేక్ కట్ చేశారు. అనంతరం చర్చి ఫాదర్, అతిధులైన అశోక్ కుమార్ మరియు సంఘ సభ్యులందరూ నూతన క్యాలెండర్స్ ను ఆవిష్కరించి వేడుకలను ముగించారు.