కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2026

పయనించే సూర్యుడు జనవరి 03 (హైదరాబాద్) కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ సీసీవి అనే స్వచ్ఛంద సంస్థ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ, పౌర సమాజానికి మీడియా మిత్రులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకు, పౌర హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు ఒక కొత్త ఆరంభంగా మారాలని ఆకాంక్షించారు. సమాజంలో పారదర్శకత బాధ్యతాయుత పరిపాలన, ప్రజల చైతన్యం పెంపొందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించగల ధైర్యం, హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడే సంకల్పం ప్రతి పౌరుడిలో ఉండాలి. ప్రజల స్వరం బలపడినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది” అని సంస్థ పేర్కొంది. రాబోయే సంవత్సరంలో పౌరహక్కులపై అవగాహన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రజా వినికిడి కార్యక్రమాలు, అవినీతి నిరోధక చర్యలపై ప్రచారం, యువతలో పౌర చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.ఈ నూతన సంవత్సరం ప్రతి పౌరుని జీవితంలో ఆశ, ధైర్యం, బాధ్యతాయుత చైతన్యం నింపాలని, సమాజం, న్యాయం, సమానత్వం వైపు మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ, మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని సంస్థ సభ్యులు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *